JOBS : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వెబ్ డెవలపర్ పోస్టుల భర్తీ

అభ్యర్ధులకు ఎంఎస్ ఆఫీస్, వర్డ్ ప్రెస్, జావా స్క్రిప్ట్ , హెచ్ టీ ఎంఎల్ లో నైపుణ్యం కలిగి ఉండాలి. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు అర్హులు, సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

JOBS : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వెబ్ డెవలపర్ పోస్టుల భర్తీ

University Of Hyderabad

JOBS : హైద్రాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. కంప్యూటర్ సెంటర్ అండ్ క్యాంపస్ నెట్ వర్క్ ఫెసిలిటీ విభాగంలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వెబ్ డెవలపర్, ప్రాజెక్ట్ అసిసోయేట్ 1 ఖాళీ, వెబ్ సైట్ కమ్ డేటా ఎంట్రీ అసిస్టెంట్ 1 ఖాళీ భర్తీ చేస్తారు.

అభ్యర్ధులకు ఎంఎస్ ఆఫీస్, వర్డ్ ప్రెస్, జావా స్క్రిప్ట్ , హెచ్ టీ ఎంఎల్ లో నైపుణ్యం కలిగి ఉండాలి. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు అర్హులు, సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులను అనుభవం అధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను పంపేందుకు 1 జులై , 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://uohyd.ac.in/ పరిశీలించగలరు.