Nurse Jobs : నెలకు రూ.2.50లక్షల జీతం… విదేశాలలో నర్సు ఉద్యోగాలు

ఇంగ్లాండ్ లోని ఆసుపత్రుల్లో నెలకు 2 లక్షల నుండి 2.50లక్షల జీతంతో నర్సుల ఖాళీలు భర్తీ చేయనున్నట్లు పేర్కోంది. డిప్లోమా, గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన మేల్, ఫిమేల్ నర్సులకు సంబంధించి 500

Nurse Jobs : నెలకు రూ.2.50లక్షల జీతం… విదేశాలలో నర్సు ఉద్యోగాలు

Nurse

Nurse Jobs : తమిళనాడు రాష్ట్ర విదేశీ ఉపాధి కల్పన సంస్ధ నిరుద్యోగ యువతకు విదేశాలలో ఉద్యోగాలకు సంబంధించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లాండ్ లోని ఆసుపత్రుల్లో నెలకు 2 లక్షల నుండి 2.50లక్షల జీతంతో నర్సుల ఖాళీలు భర్తీ చేయనున్నట్లు పేర్కోంది. డిప్లోమా, గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన మేల్, ఫిమేల్ నర్సులకు సంబంధించి 500 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వీటితోపాటు కువైట్ లో డ్రైవర్లుగా పనిచేసేందుకు పదవ తరగతి పరీక్ష పాస్‌ అయిన 30 సంవత్సరాల వయస్సు నుంచి 43 వయస్సు వారు ఐసీసీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన ధరఖాస్తు చేసుకోవాలని కోరింది. సౌదీ అరేబియాలోని హోటల్స్‌లో వంట మనిషి (పురుషులు) కావాల్సి ఉందన్నారు. వీరికి నెలకు రూ. 27 వేల నుంచి రూ.34 వేల వరకూ జీతం చెల్లిస్తారని తెలిపారు.

కువైట్‌లో ఇంటి పనులు చేయుటకు 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు అవసరమని వీరికి నెలకు రూ.29,640 మొదలుకొని రూ. 32 వేల వరకు జీతం అందజేస్తారన్నారు. ఓమెన్‌ దేశంలో డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్, ఐటీఐ, ఫిట్టర్‌ పాసైన 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సువారు క్యాస్టింగ్‌ / ఇన్స్‌పెక్షన్‌ /మెకానిక్‌ ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఖాళీలు ఉన్నాయన్నారు. వారికి నెల రూ. 29 వేలు చెల్లిస్తారని తెలిపారు.

జీతంతోపాటు విదేశాలలో పని చేసేవారి వారికి భోజనం, లాడ్జింగ్‌ అండ్‌ బోర్డింగ్, విమాన టికెట్లను ఆయా దేశ ఉపాధి సంస్థల వారు ప్రత్యేకంగా అందజేచేస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు www.omcmanpower.comవెబ్‌సైట్‌లో తమ వివరాలను రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలను విదేశీ ఉపాధికల్పన సంస్థలు 0 4 4 2 2 5 0 5 8 8 6 /22 502267 అనే ఈ నంబర్ల ద్వారా తెలుకోవచ్చు.