SDSC-SHAR Recruitment : శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎన్‌టీసీ, ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

SDSC-SHAR Recruitment : శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

SDSC-SHAR Recruitment

SDSC-SHAR Recruitment : ఆంధ్రప్రదేశ్‌ని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 94 టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Betel Cultivation : తమలపాకు సాగులో చీడపీడలు, తెగుళ్ళు నివారణ

సినిమాటోగ్రఫీ, ఫొటోగ్రఫీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్,  ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్, ఆపరేటర్ కమ్ మెకానిక్, హెచ్‌వీడీ లైసెన్స్‌డ్‌ డీజిల్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్, సివిల్, మెకానికల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Areca nut Cultivation : ఒక్కసారి నాటితే 20 ఏళ్ల వరకు దిగుబడి.. వక్కసాగుతో లాభాలు పక్కా

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎన్‌టీసీ, ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

READ ALSO : Dondasagu : దొండసాగులో మెళుకువలు…యాజమాన్యపద్దతులు

ఎంపికైన వారికి నెలకు వేతనంగా టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.44,900-రూ నుండి1,42,400 రూ, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు రూ.21,700 నుండి 69,100రూ చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అన్ లైన్ దరఖాస్తులకు చివరితేదిగా మే 16, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.shar.gov.in/ పరిశీలించగలరు.