SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్-2021 నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎస్‌బీఐ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Sbi

SBI Apprentice Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్-2021 నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎస్‌బీఐ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత గల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 26, 2021గా ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో 6వేల 100 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.

అయితే ఏ రాష్ట్రానికి చెందినవారు ఆ రాష్ట్రంలోనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని స్పష్టంచేసింది ఎస్‌బీఐ. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పోస్ట్‌లకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 125పోస్ట్‌లు, ఆంధ్రాలో 100పోస్ట్‌లు ఖాళీగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎస్‌బీఐ. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమేనని, బ్యాంకులో ఉద్యోగం కాదని వెల్లడిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ వచ్చి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు:

ఆంధ్రప్రదేశ్(జిల్లాలవారీగా):
శ్రీకాకుళం -8, విజయనగరం -8, విశాఖపట్నం -7, తూర్పు గోదావరి -8, పశ్చిమ గోదావరి -8, కృష్ణా -7, గుంటూరు -7, ప్రకాశం -8, నెల్లూరు -8, చిత్తూరు -8, కడప -8, అనంతపూర్ -8, కర్నూలు -7

తెలంగాణ(జిల్లాలవారీగా):
ఆదిలాబాద్ -3, భద్రాద్రి కొత్తగూడెం -6, జగిత్యాల్ -2,జనగాం -3, జయశంకర్ భూపాలపల్లి-3, జోగులంబ గద్వాల -2, కామారెడ్డి -4, కరీంనగర్ -4, ఖమ్మం -7, కొమరంభీమ్ -2, మహాబూబాబాద్ -3, మహబూబ్‌నగర్ -9, మల్కాజ్‌గిరి -2, మంచిర్యాల్ -2, మెదక్ -4, నాగర్‌కర్నూల్ -4, నల్గొండ -6, నిర్మల్ -3, నిజామాబాద్ -11, పెద్దపల్లి -3, రంగారెడ్డి -6, సంగారెడ్డి -5, సిద్దిపేట -5, సిరిసిల్లా -2, సూర్యాపేట -7, వికారాబాద్ -6, వనపర్తి -3, వరంగల్ -1, వరంగల్ రూరల్ -3, యాదాద్రి భువనగిరి-4

ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియ (i) ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా.. మరియు (ii) స్థానిక భాష ఆధారంగా ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ పరీక్ష మినహా ప్రశ్నలు ద్విభాషా అంటే ఇంగ్లీష్ & హిందీ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కులు ఉంటాయి. ప్రశ్న కోసం కేటాయించిన మార్క్‌లో 1/4 వ భాగం తప్పు సమాధానానికి తీసివేయబడుతుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆగస్టు-2021లో జరుగుతుంది.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఏడాదిపాటు ట్రైనింగ్ పిరియడ్‌లో స్టైపెండ్- నెలకు రూ.15,000 ఉంటుంది. బెనిఫిట్స్, అలవెన్సులు ఉండవు.

పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, చీరాల, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.