SBI CLERK ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు రిలీజ్

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 06:11 AM IST
SBI CLERK ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు రిలీజ్

దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) లో 8వేలకు పైగా ఉన్న క్లర్క్ ఉద్యోగాలకు జనవరి నెలలో దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన  ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డులను మంగళవారం(ఫిబ్రవరి 11, 2020) న ఎస్బిఐ విడుదల చేసింది. 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్దులు అధికారిక వెబ్ సైట్ లో పుట్టిన తేదీ, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఈ పరీక్షలను ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహిస్తుంది.

వీటిలో రెగ్యులర్ పోస్టులు 7వేల 870 ఉండగా, 134 బ్యాక్ లాగ్ పపోస్టులు ఉన్నాయి. ఇక స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 130 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 525 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలంగాణకు 375 పోస్టులు, ఏపీకి 150 పోస్టులను కేటాయించారు. 

పరీక్ష విధానం :
> ప్రిలిమినరీ పరీక్షలో మెుత్తం 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటాయి.
> పరీక్ష సమయం 60 నిమిషాలు ఉంటుంది. ఇందులో ప్రతి విభాగానికి 20 నిమిషాలు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వ వంతు నెగిటివ్ మార్కు ఉంటుంది. 
> ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి 30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలీటీ 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి.