TS POLYCET-2020 దరఖాస్తు ప్రారంభం

TS POLYCET-2020 దరఖాస్తు ప్రారంభం

New Project (15)

TS POLYCET-2020 ఎగ్జామ్ డేట్స్ ను అధికారులు రిలీజ్ చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీలో వివిధ వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఏప్రిల్‌ 4 చివరితేదీ అని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల (మార్చి 2, 2020)న స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్ (SBTET) నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని వివరించారు.

వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మూడేళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమా, రెండేళ్ల వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను పాలిసెట్‌ ర్యాంకుల ఆధారంగా చేపడుతామన్నారు. పాలిసెట్‌లో ర్యాంకు పొందిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ ఆధారంగా ప్రవేశాల కోసం విధిగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 2న పాలిసెట్ 2020 దరఖాస్తులు ప్రారంభం కాగా.. ఏప్రిల్ 4 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.400 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC,ST అభ్యర్థులు మాత్రం పరీక్ష ఫీజు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ఏప్రిల్ 17న తెలంగాణ పాలిసెట్ పరీక్ష నిర్వహించి, ఏప్రిల్ 25న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు మూడేళ్లు, మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు.