negrihms Jobs : షిల్లాంగ్ నైగ్రిమ్స్ లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఖాళీల భర్తీ

ఎంపిక విధానానికి సంబంధించి ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రక్రియ ఆఫ్ లైన్, ఆన్ లైన్ పద్దతిలో కొనసాగుతుంది.

negrihms Jobs : షిల్లాంగ్ నైగ్రిమ్స్ లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఖాళీల భర్తీ

Neigrihms

negrihms Jobs : షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (నైగ్రిమ్స్) లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 53 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, సీటీవీఎస్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఆప్తాల్మాలజీ, ఆర్ధోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, రేడియో థెరపీ, సర్జికల్ ఆంకాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్ షిప్, హౌస్ మెన్ షిప్ చేసి ఉండాలి. స్టేట్ మెడికల్ కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 45 సంవత్సరాలకు మించరాదు. జీతభత్యాలు గాను నెలకు 67700రూ చెల్లిస్తారు.

ఎంపిక విధానానికి సంబంధించి ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రక్రియ ఆఫ్ లైన్, ఆన్ లైన్ పద్దతిలో కొనసాగుతుంది. ఆఫ్ లైన్ ఇంటర్వ్యూను మార్చి 27, 2022న నిర్వహిస్తారు. ఆన్ లైన్ ఇంటర్వ్యూ మార్చి 28, 2022న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.neigrihms.gov.in/పరిశీలించగలరు.