బాగా వీక్ అంట : ఢిల్లీ స్కూల్స్ లో ప్రత్యేక లెక్కల క్లాస్ లు

  • Published By: venkaiahnaidu ,Published On : January 1, 2020 / 11:17 AM IST
బాగా వీక్ అంట : ఢిల్లీ స్కూల్స్ లో ప్రత్యేక లెక్కల క్లాస్ లు

ఆప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే బోర్డు ఎగ్జామ్స్ లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేజ్రీవాల్ సర్కార్. ఇందులో భాగంగా మొదటగా ఫర్ఫార్మింగ్ తక్కువగా ఉన్న 342 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించింది. ఈ 342 పాఠశాలలు గతేడాది జరిగిన 10వ తరగతి లెక్కల పరీక్షలో 55శాతం కన్నా తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదుచేశాయి. ఓ స్కూల్ లో అయితే మరీ దారుణంగా అత్యల్పంగా 7.02శాతం నమోదవడం అందరినీ షాక్ కు గురిచేసింది.

ఈ సమయంలో విద్యార్థులకు లెక్కల సబ్జెక్టు ప్రధాన సమస్యగా మారిందని గుర్తించి, లెక్కల సబ్జెక్టు పట్ట ఉన్న భయాన్ని తొలగించి,వారి సమస్యకు పరిష్కారం చూపాలని ఢిల్లీ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని 30వేల 497మంది 10వ తరగతి విద్యార్ధులకు ఈ జనవరిలో ప్రత్యేక లెక్కల తరగతులు నిర్వహించనున్నట్లు ఆప్ ప్రభుత్వం తెలిపింది.

ప్రత్యేక ఏజెన్సీలు ఈ తరగతులను నిర్వహిస్తాయని తెలిపింది. లెక్కల పరీక్ష పూర్తి అయ్యేవరకు నిర్దేశించిన 342 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 100గంటల బోధన ఉంటుంది. రోజూ రెండు గంటలు ఒకే సమయంలో 30మంది బ్యాచ్ లుగా విద్యార్థులుగా బోధించబడతారు. ఈ ప్రపోజల్ కు సోమవారం(డిసెంబర్-30,2019)ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతేడాది జరిగిన ఢిల్లీ బోర్డ్ ఎగ్జామ్స్ లో 1.66లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హాజరవగా,ఇందులో 37వేల73మంది లెక్కల పరీక్షలో ఫెయిల్ అయ్యారు. కేవలం 75శాతం మంది మాత్రమే లెక్కల పరీక్షలో పాస్ అయ్యారు. అయితే 95శాతం మందికిపైగా లాంగ్వేజస్,సోషల్ సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు.