హాలిడే ట్రిప్ : వేసవి కోసం 692 ప్రత్యేక రైళ్లు

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వచ్చే 3 నెలల కాలంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు రైల్వే అధికారులు 692 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నారు.

  • Published By: chvmurthy ,Published On : March 23, 2019 / 02:30 AM IST
హాలిడే ట్రిప్ : వేసవి కోసం 692 ప్రత్యేక రైళ్లు

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వచ్చే 3 నెలల కాలంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు రైల్వే అధికారులు 692 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నారు.

హైదరాబాద్: వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వచ్చే 3 నెలల కాలంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు రైల్వే అధికారులు 692 ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నారు. స్కూళ్లుస కాలైజీలకు ఏప్రిల్ నెలలో సెలవులు ఇవ్వనున్నందున  ఏప్రిల్1నుంచి జూన్ నెల వరకు నడిచే ఈరైళ్లలో ఎక్కువ భాగం పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్ధలాలకు అదనపు రైళ్లను నడపనున్నారు.  

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తిరుపతి,హెచ్.ఎస్. నాందేడ్, విజయవాడ,నాగర్ సోల్,రాయచూర్, కృష్ణరాజపురం, కాకినాడ, విశాఖపట్నం, పుణేకు  రైళ్లను నడపనున్నారు. వీటిలో 51 రైళ్లను నిర్విరామంగా నడుస్తాయని రైల్వే అధికాలు తెలిపారు.ఈ రైళ్లను హెచ్‌ఎస్  నాందేడ్‌, బరౌనీ, రాక్సల్‌, దర్బాంగ, జైపూర్‌, టాటానగర్‌, సంత్రాగాచి వంటి మార్గాల గుండా నడిపించనున్నారు.
Read Also : మీకు మీరే సాటి : పాల్ చేష్ట‌లు – వ‌ర్మ సెటైర్లు