APSACS Recruitment : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. పోస్టును బట్టి పదోతరగతి,ఎంబీబీఎస్‌,బీఎస్సీ నర్సింగ్‌,యూజీ,పీజీ,డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

APSACS Recruitment : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

APSACS Recruitment : ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో మెడికల్ ఆఫీసర్, ఐసీటీసీ కౌన్సెలర్, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. పోస్టును బట్టి పదోతరగతి,ఎంబీబీఎస్‌,బీఎస్సీ నర్సింగ్‌,యూజీ,పీజీ,డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.21,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఆసక్తి కలిగినవారు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, దరఖాస్తులను ఆగస్టు 23, 2022వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://spsnellore.ap.gov.in/పరిశీలించగలరు.