SSC CPO 2019: పేపర్-1 ఆన్సర్ ‘కీ’ రిలీజ్

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 04:42 AM IST
SSC CPO 2019: పేపర్-1 ఆన్సర్ ‘కీ’ రిలీజ్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జనవరి 3, 2020న  CAPF సబ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, CISFలో అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన SSC CPO 2019 పేపర్-1 పరీక్ష ఆన్సర్ ‘కీ’ విడుదల చేసింది. ఆన్సర్ ‘కీ’ పై సందేహాలున్న అభ్యర్థులు జనవరి 6న సాయంత్రం 5 గంటల్లోగా తమ అభ్యంతరాలను తెలపాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒక్కో అభ్యంతరానికి రూ.100 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. 

ఇక పేపర్-2 పరీక్ష తేది వెల్లడించాల్సి ఉంది. మొదటి దశ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంది. కానీ పేపర్ 2 పరీక్ష మాత్రం రాత పరీక్ష విధానంలో ఉంటుంది. దీనిలో ఇంగ్లీష్, కాంప్రహెన్షన్ కు సంబంధించి.. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష  సమయం 2 గంటలు.

పేపర్ 1 పరీక్ష రీజనింగ్ 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్ 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 50 మార్కులకు జరిగింది. ఈ పరీక్ష కూడా సమయం 2 గంటలు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను పేపర్ 2 పరీక్షకు ఎంపిక చేస్తారు.