SSCలో 1.40లక్షల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

  • Published By: veegamteam ,Published On : March 1, 2020 / 03:11 AM IST
SSCలో 1.40లక్షల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు గ్రూప్-B,C లలో దాదాపు 1.40లక్షల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ సందర్భంగా చైర్మన్ బ్రజ్ రాజ్ శర్మ మాట్లాడుతూ.. నాన్ టెక్నికల్ తో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తామని చెప్పారు. 

ఇప్పటికే 14వేల 611 మంది అభ్యర్థులను ప్రభుత్వానికి నియామకం కోసం సిఫారసు చేసినట్లు తమ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో సుమారు 85వేల పోస్టులను భర్తీ చేయడానికి కమిషన్ ఫలితాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రివెన్సెస్ అండ్ పెన్షన్స్ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

2020 నుంచి 21 ఆర్థిక సంవత్సరంలో అదనంగా 40వేల ఖాళీలను కమిషన్ భర్తీ చేసే అవకాశం ఉందని శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దిగువ, మధ్య పోస్టులకు నియామకం కోసం  పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. పోస్టును బట్టి 18 నుంచి 30 ఏళ్ల వయస్సువారు దరఖాస్తు చేయొచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.