సమ్మర్ హాలిడేస్ : 30 నుంచి కాలేజీలకు సెలవులు

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 02:07 AM IST
సమ్మర్ హాలిడేస్ : 30 నుంచి కాలేజీలకు సెలవులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. మే 31వరకు సెలవులు కొనసాగుతాయన్నారు. జూన్‌ 1న కాలేజీలు ప్రారంభమవుతాయని తెలిపారు. సెలవుల్లో క్లాసుల నిర్వహణ, అడ్మిషన్స్ చేపట్టడానికి వీల్లేదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలన్నీ ఈ ఆదేశాలను పాటించాలని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

మే 13 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులుగా పాఠశాల విద్యా శాఖ ఇదివరకే ప్రకటించింది. దీంతో 12వ తేదీన చివరి పనిదినంగా అమలు కానుంది. జూన్ 1న తిరిగి పాఠశాళలు ప్రారంభం కానున్నాయి. జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమం ఉంటుందని.. అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. వాటి వాల్యుయేషన్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఫలితాలను కంప్యూటర్ లోకి ఎక్కిస్తున్నారు. అది పూర్తి కాగానే రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.