NIT Kurukshetra : ఎన్ఐటి కురుక్షేత్రలో టీచింగ్ స్టాఫ్ భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్‌ లేదా రీసెర్చ్‌ అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి వయసు 60 యేళ్లకు మించరాదు.

NIT Kurukshetra : ఎన్ఐటి కురుక్షేత్రలో టీచింగ్ స్టాఫ్ భర్తీ

Teaching Staff Recruitment in NIT Kurukshetra

హర్యాణా రాష్ట్రం కురుక్షేత్రలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ లో తాత్కాలిక ప్రాతిపదికన పలు టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 99 అసిప్టెంట్‌ ప్రొపెసర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌, హ్యుమానిటీస్ & సోషల్‌ సైన్సెస్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, కంప్యూటర్ అప్లికేషన్స్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్‌ లేదా రీసెర్చ్‌ అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి వయసు 60 యేళ్లకు మించరాదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,01,500ల నుంచి రూ.1,67,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హార్డుకాపీలను డౌన్‌లోడ్‌ చేసుకుని సెప్టెంబర్‌ 10, 2022వ తేదీలోపు రిజిస్ట్రార్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కురుక్షేత్ర-136119 చిరునామాకు పంపాల్సి ఉంది. దరఖాస్తుకు తుదిగడువు సెప్టెంబర్‌ 5, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nitkkr.ac.in./పరిశీలించగలరు.