ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై KCR దిగ్ర్భాంతి

  • Published By: madhu ,Published On : April 25, 2019 / 02:47 AM IST
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై KCR దిగ్ర్భాంతి

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఫెయిల్ అయినంత మాత్రానా..జీవితం ఆగిపోదని.. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ స్పందించారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఇంటర్ మీడియట్‌లో ఫెయిలయ్యామనే బాధతో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరంమని, ఇందుకు చాలా బాధ పడినట్లు వెల్లడించారు. ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరమన్నారు. పరీక్షల్లో ఫెయిలైతే..జీవితంలో ఫెయిలైనట్లు కాదని..ప్రాణం చాలా విలువైందన్నారు. తల్లిదండ్రులకు పుట్టెడు దు:ఖాన్ని మిగల్చొద్దన్నారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ – వెరిఫికేషన్, రీ – కౌంటింగ్ చేయాలని సూచించారు. పాసైన విద్యార్థులు కూడా రీ – వెరిఫికేషన్, రీ – కౌంటింగ్ కోరుకుంటే..గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకోవాలని సూచించారు. స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షల నిర్వాహణ చేయాలనే యోచించారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలన్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డికి అప్పగిస్తున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణలో తలెత్తుతున్న తలనొప్పులు నివారించడం కూడా అసాధ్యమేదీ కాదు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.