తెలంగాణలో ఏ పరీక్ష ఎప్పుడు ?

  • Published By: madhu ,Published On : August 24, 2020 / 11:46 AM IST
తెలంగాణలో ఏ పరీక్ష ఎప్పుడు ?

తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షల తేదీల వివరాలను విద్యా మండలి ఖరారు చేసంది. ఎంసెట్, ఇంజినీరింగ్, ఈసెట్ తో పాటు పాలిసెట్ తేదీలను ఈ నెల 10న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో అధికారులు నిర్ణయించారు.



ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జరిగే ఏడు ప్రవేశ పరీక్షలకు మొత్తం 4.07 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో పరీక్షలు రాసే స్టూడెంట్స్ 47 వేల 312 మంది ఉన్నారు.

వాటిలో ఎంసెట్ ఇంజినీరింగ్ కు 25వేలు, అగ్రికల్చర్ 16వేలకు పైగా ఉండడం విశేషం. అత్యధికంగా ఎంసెట్ ఇంజినీరింగ్ కు 1.42 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత..78 వేల అగ్రికల్చర్ నిలిచింది. గత సంవత్సరం కంటే..ఈసెట్, పీజీ ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీఈసెట్ కు దరఖాస్తులు పెరిగాయి.



ఏ పరీక్ష ఎప్పుడు ?

ఈసెట్ ఆగస్టు 31
→ ఎంసెట్ (ఇంజినీరింగ్) సెప్టెంబరు 9, 10, 11, 14.
→ పీజీఈసెట్ సెప్టెంబరు 21, 22, 23, 24.
→ ఎంసెట్ (అగ్రికల్చర్) సెప్టెంబరు 28, 29.
→ ఐసెట్ సెప్టెంబరు 30, అక్టోబరు 1.
→ ఎడ్‌సెట్ అక్టోబరు 1, 3.
→ లాసెట్ అక్టోబరు 4.