Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్

రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలల పనితీరుపై సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం శాశ్వత స్టడీ సర్కిల్ ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్

Ts Govt

Telangana government : తెలంగాణలోని రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 86 (బీసీ-04, ఎస్సీ-75, ఎస్టీ-7) రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఇవాళ బీఆర్‌కేఆర్‌ భవన్‌లో అన్ని సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలల పనితీరుపై సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం శాశ్వత స్టడీ సర్కిల్ ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కొసం సమర్పించుటకుగానూ అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కాన్సెప్ట్‌ నోట్‌ను సిద్ధం చేయాలని ఆయన అధికారులను కోరారు.

TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరిశుభ్రత కోసం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడానికి, వంట సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.