ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనకు ఓకే చెప్పిన ప్రభుత్వం.. 30శాతం సిలబస్ కోత

ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనకు ఓకే చెప్పిన ప్రభుత్వం.. 30శాతం సిలబస్ కోత

Covid-19 కారణంగా ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్‌ బోర్డు పంపించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఒప్పుకుంది. అలాగే MPC, BPC గ్రూపుల్లో సిలబస్ CBSEలో, రాష్ట్రంలో ఒకే మాదిరిగా ఉంటుంది కాబట్టి ఆయా గ్రూపుల్లో CBSE తొలగించే పాఠ్యాంశాలను రాష్ట్రంలో కూడా తొలగించాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.




ఇక పనిదినాలు గతేడాది 222 ఉంటే.. ఈసారి 182 మాత్రమే ఉన్నాయి. అంటే గతేడాది కంటే ఇప్పుడు 40 రోజులు తగ్గిపోయాయి. అందుకే సిలబస్ ను తగ్గించాలనుకున్నారు. ఇక జేఈఈ మెయిన్, నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా CBSE తొలగించిన పాఠాలనే రాష్ట్ర సిలబస్‌ లో కూడా తొలగించనున్నారు.
https://10tv.in/ration-card-will-sanctioned-one-day-with-all-eligible-documents/
దీనిపై ఇప్పటికే నియమించిన సబ్జెక్టు కమిటీలు కోత పెట్టాల్సిన సిలబస్‌ను ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఖరారు చేయనున్నాయి. ఆ వివరాలను ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించనుంది. అంతేకాదు గత మార్చిలో జరిగిన Annual Exams రాసేందుకు ఫీజు చెల్లించి పరీక్షలు రాయని 27వేల మంది విద్యార్థులను కూడా పాస్‌ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే బోర్డు ఉత్తర్వులను జారీ చేయనుంది.




అదేవిధంగా విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిషత్తు ఏమవుతుందో అని భయపడుతున్నారు. ఇక 1 నుంచి 8వ తరగతి పిల్లల సంగతి అయోమయంగా ఉంది అంటున్నారు. అసలు విద్యాసంస్థలు తెరుస్తారో లేదో అంటూ భయపడిపోతున్నారు.