తెలంగాణ ఇంటర్ ఫలితాలు : బాలికలే టాప్

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 11:43 AM IST
తెలంగాణ ఇంటర్ ఫలితాలు : బాలికలే టాప్

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో బాలకలదే పైచేయి. ఫస్టియర్ లో 59.8 శాతం, సెకండియర్ లో 65శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్ లో మెదక్ లాస్ట్ ప్లేస్ లో నిలిచాయి.
Also Read : మే.. లోనే లాంచ్ : శాంసంగ్ నుంచి మడతబెట్టే ఫోన్

సెకండియర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్ ప్లేస్ లో, జగిత్యాల జిల్లా లాస్ట్ ప్లేస్ లో నిలిచాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ఏప్రిల్ 19న విడుదల చేస్తామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. మే 14వ తేదీ నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

* ఫస్టియర్ లో 59.8 శాతం ఉత్తీర్ణత
* సెకండియర్ లో 65 శాతం ఉత్తీర్ణత
* 25.8 శాతం ప్రైవేట్ విద్యార్థుల ఉత్తీర్ణత
* ఇంటర్ ఫలితాల్లో బాలకలే టాప్
* ఇంటర్ ఫస్టియర్ లో 2లక్షల 70వేల 575 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
* ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్(76శాతం), మెదక్ జిల్లా లాస్ట్(29శాతం)
* సెకండియర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్, జగిత్యాల జిల్లా లాస్ట్
* మే 14 నుంచి అడ్వాన్స్ డ్ పరీక్షలు
* ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష తేదీల్లో మార్పులు
* ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 25 చివరి తేదీ
* ఒకేషనల్ విభాగంలో 43,520 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 23,168 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
* సెకండియర్ జనరల్ విభాగం నుంచి 2,64, 679 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 25,635 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఫలితాలను ఈ వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు:
http://results.cgg.gov.in/
bie.tg.nic.in
http://www.bie.telangana.gov.in/

తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1300 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ల నుంచి 9,42,719 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 4,52,550 మంది.. సెకండియర్ కి చెందిన విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు.
Also Read : వింతల్లో వింత : 8 ఏళ్ల బాలుడి కడుపులో పిండం.. డాక్టర్లు షాక్