ఇంటర్ బోర్డును ఎత్తివేస్తారా

  • Published By: madhu ,Published On : April 24, 2019 / 03:20 AM IST
ఇంటర్ బోర్డును ఎత్తివేస్తారా

ఇంటర్మీడియట్ ఫలితాల అంశం చినికి చినికి గాలి వానగా మారింది. ఇంటర్ బోర్డు చేసిన తప్పిదం ప్రభుత్వానికి అపవాదును తెచ్చి పెట్టింది. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ఇంటర్ బోర్డునే ఎత్తివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ వ్యవహరించిన విధానంపై ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విద్యారంగ సంస్కరణల్లో ఇంటర్ బోర్డును పూర్తిగా సంస్కరించనున్నట్లు తెలుస్తోంది.

అవసరమనుకుంటే బోర్డును ఎత్తివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెంట్రల్ సిలబస్ తరహాలో ప్లస్‌ 2 విద్యావిధానం అమలుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న టెన్త్, ఇంటర్ బోర్డును విలీనం చేసి CBSC తరహాలో నూతన విద్యావిధానాన్ని తీసుకురావాలని సర్కార్ ఆలోచన చేస్తుంది. ఈ విద్యా విధానం ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది.. కేంద్రీయ విద్యాసంస్థలు ఏ విధంగా ఈ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయనే అంశంపై అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది.