Telangana Medical Jobs : తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీ

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్‌ 20వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.

Telangana Medical Jobs : తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీ

Telangana Medical and Health Department has filled the job vacancies

Telangana Medical Jobs : ప్రభుత్వ శాఖల్లోని పలు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి వరుస వెంట నోటిఫికేషన్‌ లు జారీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వైద్యారోగ్య శాఖలో ఉన్న మొత్తం 1147 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఖాళీల వివరాలను పరిశీలిస్తే మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఉన్న అసిస్టింట్ ఫ్రోఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ అనాటమీ 26, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఫిజియాలజీ 26, అసిస్టెంట్‌ పథాలజీ 31, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ 23, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ మైక్రో బయాలజీ 25, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఫొరెన్సిక్‌ మెడిసిన్‌ 25, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ బయో కెమిస్ట్రీ 20, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్‌ 14, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ జనరల్‌ మెడిసిన్‌ 111, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ జనరల్‌ సర్జరీ 117, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పిడియాట్రిక్‌ 77, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ అనిస్తీషియా 155, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ రేడియాలజీస్‌ 46, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ రేడియేషన్‌ యాంకాలజీ 05, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ సైకియాట్రి 23, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ రెసిపెటరీ మెడిసిన్‌ 10 ఖాళీలు ఉన్నాయి.

అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్‌ డెర్మటాలజీ మెడిసిన్‌ 13, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ప్రొఫెసర్‌ ఒబెస్ట్రిక్‌ అండ్‌ గైనకాలజీ 142, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ప్రొఫెసర్ ఆప్తామాలజీ 08, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ అర్థోపెడిక్స్‌ 62, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఒటో రిహ్నో 15, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ హాస్పిటల్ అడ్మిన్‌ 14, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ 15, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ కార్డియాలజీ 17, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ కార్డిక్‌ సర్జరీ 21, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఎండోక్రినోలజీ 12, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ న్యూరాలజీ 11, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ న్యూరో సర్జన్‌ 16, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ప్లాస్టిక్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ 17, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పిడియాట్రిక్‌ సర్జరీ 08, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ యూరాలజీ 17, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నెఫ్రాలజీ 10, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ మెడికల్‌ అంకాజలీ 01 ఖాళీలు ఉన్నాయి.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్‌ 20వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా జనవరి 05, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://mhsrb.telangana.gov.in పరిశీలించగలరు.