Group-4 Posts : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 9,168 గ్రూప్‌-4 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Group-4 Posts : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

Group-4 posts : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 9,168 గ్రూప్‌-4 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా రూ.9,168 గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు.

గ్రూప్‌-4 ఉద్యోగాల్లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వీటిలో అధికంగా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 2,077 జూనియన్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ పరిపాలన అనుమతి ఇచ్చింది.

అంతకముందు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2లో 663 పోస్టులను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరికొన్ని కేటగిరీ పోస్టులను చేరుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టులు భారీగా పెరిగాయి. గ్రూప్-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.