చెక్ ఇట్: పదోతరగతి ఫీజు చెల్లింపు గడువు పెంపు

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 01:06 AM IST
చెక్ ఇట్: పదోతరగతి ఫీజు చెల్లింపు గడువు పెంపు

తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జనవరి 22 వరకు పొడిగించారు. కానీ, ఫీజు చెల్లించే ముందు రూ.1000 ఆలస్యరుసుముతో చెల్లించాల్సి ఉంటుందని.. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ. సత్యనారాయణరెడ్డి ఒక ప్రకనటలో తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థలు త్వరగా చెల్లించాల్సి ఉంటుందని కోరారు.

పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టులు పరీక్ష రాసే విద్యార్థులు రూ.110 చెల్లిస్తే సరిపోతుంది. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు మాత్రం రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇప్పటివరకు చెల్లించని విద్యార్థులు రూ.1000 ఆలస్యరుసుము అదనంగా చెలించాల్సి ఉంటుంది.  నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారికి మినహాయింపు కల్పించిన సంగతి తెలిసిందే. 

Read Also.. IBPS Clerk అడ్మిట్ కార్డు రిలీజ్.. పరీక్ష ఎప్పుడంటే?

అయితే పట్టణ ప్రాంతాల్లో రూ.24,000 లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20,000 లోపు కుటుంబ వార్షికాదాయం ఉన్న విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇందుకు గాను.. ఆయా విద్యార్థులు కుటుంబ వార్షికాదాయానికి సంబంధించి ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.