తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదల

  • Published By: chvmurthy ,Published On : February 15, 2020 / 03:57 PM IST
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఎంసెట్, ఈసెట్  పరీక్ష షెడ్యూళ్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి శనివారం ఫిబ్రవరి15న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ కు తెలంగాణలో 51, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుతించబోమని స్పష్టంచేశారు. పరీక్ష ఫీజులో ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు రాయితీలు కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400, ఇతరులకు రూ.500ల చొప్పున పరీక్ష ఫీజు ఉంటుందని పాపిరెడ్డి  చెప్పారు. ఈడబ్ల్యూఎస్ అమలుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతిరాలేదన్నారు. ఎంసెట్  దరఖాస్తులో మాత్రం ఈడబ్ల్యూఎస్  ఆప్షన్ ఉంటుందని తెలిపారు.

ఫిబ్రవ‌రి 19వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 30 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 6వ తేదీ వరకు, రూ.1000 ఫైన్‌తో ఏప్రిల్‌ 13వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.5వేల ఫైన్‌తో ఏప్రిల్‌ 20 తేదీ వరకు, రూ.10వేల జరిమానాతో ఏప్రిల్‌ 27వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తారు. మే 4,5,6వ తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, మే9,11వ తేదీల్లో అగ్రికల్చర్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు జరగనున్నాయి.

ఎంసెట్ షెడ్యూల్ ఇదే
> పిబ్రవరి 19న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
> ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ
> రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6వరకు..
> రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 వరకు
> రూ. 5వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు
> రూ. 10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.

> మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులో సవరణలకు అవకాశం
> ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకొనే అవకాశం

> మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష
> మే 9, 11 తేదీల్లో ఎంసెట్ వ్యవసాయ, వైద్య పరీక్షలు జరుగుతాయి.

ఈసెట్ షెడ్యూల్ ఇదే
> ఫిబ్రవరి 24 నుంచి మార్చి 28 వరకు ఆన్ లైన్ లో  దరఖాస్తుల స్వీకరణ
> రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 8 వరకు..
> రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు …
> రూ5వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు..
> రూ. 10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.