TSPSC Notification: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 181 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్‌సీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 181 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

TSPSC Notification: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) మరిన్ని ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేష్ విడుదల చేసింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 181 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రేడ్-1కు చెందిన ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులే అర్హులు. మహిళలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 8-29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. చివరి తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తైన తర్వాత అర్హత పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం అభ్యర్థులు www.tspsc.gov.in ను సంప్రదించవచ్చు.