సీనియర్ స్టెనోగ్రాఫర్.. అడ్మిట్ కార్డు రిలీజ్

  • Edited By: veegamteam , November 15, 2019 / 04:23 AM IST
సీనియర్ స్టెనోగ్రాఫర్.. అడ్మిట్ కార్డు రిలీజ్

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సీనియర్ స్టెనోగ్రాఫర్ పరీక్షకు సంబంధించిన గతేడాది జులై 2న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు (నవంబర్ 15, 2019)న హాల్‌టికెట్లను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 17, 18 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు. 

రాతపరీక్షలో అర్హత సాధించినవారికి రెండో దశలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. పరీక్షలో అర్హత మార్కులను OCలకు 40శాతం, BCలకు 35శాతం, SCలకు 30శాతంగా నిర్ణయించారు. 

ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే అభ్యర్థులు మొదట రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో ఎంపికైనవారికి టైపింగ్‌ టెస్ట్‌  నిర్వహిస్తారు. ఈ పరీక్ష క్వాలిఫై అయినవారిని మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

Read Also.. CISFలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు: వారికి మాత్రమే!