TSRJC CET- 2020 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 06:49 AM IST
TSRJC CET- 2020 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న35 రెసిడెన్షియల్ కాలేజీల్లో 2020-2021 విద్యా సంవత్సారానికిగాను ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు(TSRJC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లలో ప్రవేశాలు కల్పిస్తుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

విద్యార్హత : మార్చి 2020 పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న తెలంగాణ  విద్యార్ధులు మాత్రమే అర్హులు.

పరీక్ష విధానం : TSRJC ప్రవేశ పరీక్ష ఇంగ్లీష్, తెలుగు బాషల్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 2:30 గంటలు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : అభ్యుర్ధులు రూ.200 చెల్లించాలి.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 16, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 15, 2020.
పరీక్ష తేదీ : మే 10, 2020.

Also Read | ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సమర్థించిన క్యాట్