అప్లై చేసుకోండి: జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రెండు రోజులే గడువు

  • Published By: veegamteam ,Published On : November 18, 2019 / 04:35 AM IST
అప్లై చేసుకోండి: జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రెండు రోజులే గడువు

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSSPDCL)లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 31న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఆన్‌ లైన్ దరఖాస్తుకు ఇంకా రెండు రోజులే గడువు ఉంది. నవంబర్ 20న గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

అభ్యర్ధులు డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  దరఖాస్తు ఫీజుగా రూ.100, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.  

అభ్యర్ధులు జులై 1, 2019 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.ఎక్స్‌సర్వీస్ మెన్ అభ్యర్థులకు వయోపరిమితిలో మూడు సంవత్సరలపాటు సడలింపును కల్పించారు.  అంతేకాదు ఉద్యోగుల్లో వీరికి 2శాతం రిజర్వేషన్ కూడా కేటాయించారు.   

పరీక్ష విధానం:
పరీక్ష సమయం 120 నిమిషాలు. మొత్తం 130 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో 80 మార్కులకు రాతపరీక్ష, 50 మార్కులకు ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. 

ముఖ్యతేదిలు:
దరఖాస్తు చివరితేది: నవంబర్ 20, 2019.
పరీక్ష తేది: డిసెంబర్ 22, 2019.

Read Also: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ : 1113 ఉద్యోగాలు భర్తీ