పోటెత్తిన నిరుద్యోగులు: 25పోస్టులు.. 36వేల 557 దరఖాస్తులు

  • Published By: veegamteam ,Published On : November 24, 2019 / 02:05 AM IST
పోటెత్తిన నిరుద్యోగులు: 25పోస్టులు.. 36వేల 557 దరఖాస్తులు

పోటెత్తిన నిరుద్యోగ యువత.. పోస్టులు 25 ఉంటే దరఖాస్తుల సంఖ్య మాత్రం 36వేల 557 వచ్చాయి అంటే ఉద్యోగాలు లేక ఎంతమంది యువత తిప్పలు పడుతున్నారో అర్ధమౌతోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL‌) గత నెలలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. 

అయితే 25 JPO పోస్టులకు గాను.. 2వేల 500 జూనియర్‌ లైన్మన్ (JLM) పోస్టులకు 58,531 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 500 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు లక్షా 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు TSSPDCL‌ అధికారవర్గాలు తెలిపాయి. ఇక జూనియర్‌ అసిస్టెంట్‌ దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగియడంతో ఇంకా వచ్చిన మొత్తం దరఖాస్తుల సంఖ్యను నిర్ధారించలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

ఇక దరఖాస్తుల పరిశీలన ముగిసిన అనంతరం అర్హులైన అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది. ఇదిలావుండగా జూనియర్‌ లైన్‌మన్, జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు డిసెంబర్‌ 15న, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు డిసెంబర్‌ 22న రాత పరీక్ష నిర్వహించనున్నారు.