UPSC Recruitment : కేంద్రప్రభుత్వ సంస్ధల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్

పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 30 నుండి 55 సంవత్సరాలులోపు ఆయా పోస్టులను బట్టి నిర్ణయించారు. అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి.

UPSC Recruitment : కేంద్రప్రభుత్వ సంస్ధల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్

UPSC

UPSC Recruitment : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 69 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి రీజినల్ డైరెక్టర్ 1, అసిస్టెంట్ కమిషనర్ 1, అసిస్టెంట్ ఓర్ డ్రెస్సింగ్ ఆఫీసర్ 22 , అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్ 4, అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్ 34, యూత్ ఆఫీసర్ 7 ఖాళీలు ఉన్నాయి.

పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 30 నుండి 55 సంవత్సరాలులోపు ఆయా పోస్టులను బట్టి నిర్ణయించారు. అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

అభ్యర్ధుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది:13.04.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ బైట్ ; https://www.upsconline.nic.in పరిశీలించగలరు.