చదువు కోసం : ట్రాన్స్ జెండర్ల కోసం యూనివర్సిటీ

  • Published By: madhu ,Published On : December 26, 2019 / 10:26 AM IST
చదువు కోసం : ట్రాన్స్ జెండర్ల కోసం యూనివర్సిటీ

ట్రాన్స్ జెండర్ల కోసం దేశంలోనే మొట్టమొదటి విశ్వ విద్యాలయం ప్రారంభం కాబోతోంది. యూపీలోని కుషినగర్ జిల్లాలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుకోవచ్చు. అంతేగాకుండా పరిశోధన చేయడానికి, పీహెచ్ డీ చేసుకొనే సౌకర్యాలు కల్పించనున్నారు. కుషి నగర్ జిల్లాలోని ఫాజిల్ నగర్ బ్లాక్ లో విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయనున్నారు.

 

అఖిల్ భారతీయ కిన్నార్ శిక్ష సేవా ట్రస్టు (ఆలిండియా ట్రాన్స్ జెండర్ ఎడ్యుకేషన్ సర్వీసు ట్రస్టు) దీనిని నిర్మిస్తోంది. ట్రాన్స్ జెండర్లు విద్యను పొందగలిగే..దేశంలో ఇదే మొదటిదని చెప్పవచ్చు. వచ్చే సంవత్సరం (2020) జనవరి 15వ తేదీ నుంచి ఇద్దరు పిల్లలకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందని, ఫిబ్రవరి, మార్చి నుంచి తరగతులు ప్రారంభమౌతాయని ట్రస్టు అధ్యక్షుడు డా. కృష్ణ మోహన్ మిశ్రా వెల్లడించారు. 

సమాజంలో ఉన్న వీరు విద్యను పొందే అవకాశం కల్పిండం జరుగుతుందని ఎమ్మెల్యే గంగా సింగ్ కుశ్వాహా తెలిపారు. ఇందుకు ట్రాన్స్ జెండర్ల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. సమాజంలో బతుకుతున్న తమకు విద్యను నేర్పించడానికి ముందుకొస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, తమ జీవితాలను మార్చివేస్తుందని అనుకుంటున్నట్లు ట్రాన్స్ జెండర్లలలో ఒకరు వెల్లడించారు. 
Read More :- కొడనాడు ఎస్టేట్ నాదే..శశికళ