Unlock -5 : schools తెరుస్తారా ? 10 ఏళ్లలోపు విద్యార్థుల భవిష్యత్తు ఏంటి?

  • Published By: madhu ,Published On : October 1, 2020 / 06:31 AM IST
Unlock -5 : schools తెరుస్తారా ? 10 ఏళ్లలోపు విద్యార్థుల భవిష్యత్తు ఏంటి?

unlock-5-will-schools-reopen : కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ పేరుతో అన్నీ రీ ఓపెన్‌ చేసేందుకు గైడ్‌లైన్స్‌ ఇచ్చేస్తోంది. స్కూల్స్‌, కాలేజెస్‌ విషయంలో నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. మరిప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? మరికొన్నాళ్లు ఆన్‌లైన్‌ క్లాసులు కంటిన్యూ చేస్తాయా? ఒకవేళ స్కూల్స్‌ (Schools) ఓపెన్‌ చేస్తే పిల్లల్ని పంపించేందుకు పేరెంట్స్‌ రెడీగా ఉన్నారా?



కేంద్రం గ్రీన్ సిగ్నల్
స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థల రీ ఓపెనింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడో కొత్త సమస్య ఎదురుకానుంది. కొందరు విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు ఇష్ట పడతారు. ఆన్ లైన్ క్లాసుల వల్ల సమస్యలు ఎదురయ్యే మరికొందరు విద్యార్థులు నేరుగా క్లాస్‌రూమ్‌లో పాఠాలు వినేందుకు మొగ్గుచూపుతారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఆన్ లైన్ క్లాసులు వినేవారికి అవకాశం కల్పించాలి. క్లాస్ రూమ్‌కు వచ్చిన వారికి కూడా పాఠాలు చెప్పాలి.



మేనేజ్‌మెంట్లకు సమస్యలు
దీంతో విద్యాసంస్థల మేనేజ్‌మెంట్లకు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇటు ఎదురుగా ఉన్నవారిని, అటు ఆన్ లైన్లో ఉన్నవారిని మేనేజ్ చేయడం టీచర్లకు కూడా ఇబ్బంది కలగవచ్చు. దీని వల్ల అందరూ ఆన్ లైన్లో క్లాసులు వినాలనో, లేకపోతే అందరూ క్లాస్ రూమ్‌కు రావాలనే కండిషన్లు విధించే అవకాశాలు కూడా లేకపోలేదు.



పదేళ్ల లోపు పిల్లలంతా
ఇక పదేళ్ల లోపు పిల్లలంతా ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరి 10 సంవత్సరాల్లోపు విద్యార్థుల భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. వారిని కేవలం ఆన్ లైన్ క్లాసులకే పరిమితం చేస్తారా? ఒకవేళ ఆన్ లైన్ క్లాసులే నిర్వహిస్తే ఆ వయసు వారికి ఆన్ లైన్ క్లాసులు ఏం అర్థం అవుతాయనేది మిలియన్ డాలర్ ప్రశ్న. దీంతో నర్సరీ నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు డైలమాలో పడతారు. వారి క్లాసుల విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన తప్పేలా లేదు.



అన్ లాక్-5 (Unlock 5) మార్గదర్శకాలు
కేంద్ర హోంశాఖ అన్ లాక్-5 (Unlock 5) మార్గదర్శకాల్ని జారీ చేసింది. స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 15 తర్వాత దశలవారీగా వాటిని తెరవొచ్చని తెలిపింది. స్కూళ్లు, విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చించి పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆన్ లైన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కొనసాగించవచ్చు. ఆన్ లైన్ క్లాసుల విధానాన్ని ప్రోత్సహించాలి.



నిబంధనలను కచ్చితంగా పాటించాలి
స్కూళ్లు (Schools) ఓపెన్ చేసిన తర్వాత కొందరు ఆన్ లైన్ క్లాసులు వినడానికి ఇష్టపడితే వారికి ఆ అవకాశం కల్పించాలి. విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి తీసుకున్న తర్వాత ప్రత్యక్షంగా క్లాసులకు హాజరుకావాలి. అటెండెన్స్ తప్పనిసరికాదు. తమ రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తయారు చేయాలి. అన్ని విద్యా సంస్థలు సదరు నిబంధనలను కచ్చితంగా పాటించాలని హోంశాఖ గైడ్‌లైన్స్‌ ఇచ్చింది.