UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 06:47 AM IST
UPSC సివిల్ సర్వీసెస్  నోటిఫికేషన్ రిలీజ్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ‘సివిల్ సర్వీసెస్ – 2020’ నోటిఫికేషన్ ను బుధవారం(ఫిబ్రవరి 12, 2020) న విడుదల చేసింది. ఇందులో మెుత్తం 796 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, ఇండియన్ రైల్వే గ్రూప్ -ఏ వంటి వివిధ రకాల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ సంవత్సరం పోస్టుల సంఖ్య గతేడాది తో పోలీస్తే తక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి 12, 2020 నుంచి మార్చి 3, 2020 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. 
  
విద్యార్హత : 
అభ్యర్దులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్దులు కూడా ప్రిలీమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయోపరిమితి : అభ్యర్దుల వయసు ఆగస్టు 1, 2020 నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసీ, EWS అభ్యర్దులు రూ.100 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్దులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపికా విధానం : అభ్యర్దులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వూ నిర్వహిస్తారు. ఈ మూడు లెవెల్స్ లో క్వాలిఫై అయిన వారినే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 12, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 3, 2020.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : మే 31, 2020.
మెయిన్స్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 18, 2020.