Upsc : యూపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్

ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, అనుభవం కలిగి ఉండటాన్ని అర్హతగా నిర్ణయించారు.

Upsc : యూపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్

Upsc Jobs (1)

Upsc : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 36 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, అనుభవం కలిగి ఉండటాన్ని అర్హతగా నిర్ణయించారు.

రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులను ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరితేది 2021, డిసెంబర్ 02గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.upsc.gov.in