UPSC Recruitment : కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుండి 38ఏళ్లు మించకుండా ఆయా పోస్టును బట్టి వయసు కలిగి ఉండాలి.

UPSC  Recruitment : కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్

UPSC Recruitment : కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పలు ఖాళీల భర్తీకి అభ్యర్ధుల నుండి యూపీఎస్సీ దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనుంది. భర్తీ చేయనున్న ఖాళీల్లో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ 1 ఖాళీ, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ 1 ఖాళీ, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ కెమిస్ట్రీ 1 ఖాళీ, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 1, 12 ఖాళీలు ఉన్నాయి.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుండి 38ఏళ్లు మించకుండా ఆయా పోస్టును బట్టి వయసు కలిగి ఉండాలి.

అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.upsc.gov.in పరిశీలించగలరు.