Job Vacancies : ఎఐఎఎస్ఎల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్థులను గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Job Vacancies : ఎఐఎఎస్ఎల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Jobs (2)

Job Vacancies : ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ముంబయి కార్యాలయంలోని ఖాళీలను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్‌ విధానంలో మొత్తం 62 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో సర్వీస్‌ అస్యూరెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 50, సర్వీస్‌ అస్యూరెన్స్‌ మేనేజర్ పోస్టులు 12 ఉన్నాయి.

సర్వీస్‌ అస్యూరెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. సర్వీస్‌ అస్యూరెన్స్‌ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి. అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు.

అభ్యర్థులను గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, జీఎస్‌డీ కాంప్లెక్స్‌, సీఎస్‌ఎంఐ ఎయిర్‌పోర్ట్, టెర్మినల్‌ 2, అందేరి ఈస్ట్‌, ముంబయి-400099. దరఖాస్తుల స్వీకరణకు 6 ఆగస్టు 2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiasl.in/ పరిశీలించగలరు.