CPRI Recruitment : బెంగళూరులోని సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ (బీఈ/బీటెక్‌), డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

CPRI Recruitment : బెంగళూరులోని సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Vacancies in Central Power Research Institute, Bangalore

CPRI Recruitment : భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల వివరాలకు సంబంధించి ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులు 20, సైంటిఫిక్/ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు 7, టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులు 15 ,ఎంటీఎస్‌ గ్రేడ్-1(వాచ్‌మ్యాన్) పోస్టులు 7 ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ (బీఈ/బీటెక్‌), డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.44,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా నవంబర్‌ 21, 2022వ తేదీ లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://cpri.res.in/ పరిశీలించగలరు.