EFLU Recruitment : ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

EFLU Recruitment : ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Job Vacancies

EFLU Recruitment : హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్‌, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న 97 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Dehydrating Drinks : మిమ్మల్ని డీహైడ్రేటింగ్ కు గురిచేసే 5 పానీయాలు ఇవే !

ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలకు సంబంధించి గ్రూప్ ఎ పోస్టులు డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 4, హిందీ ఆఫీసర్‌ పోస్టులు 1, డిప్యూటీ లైబ్రేరియన్ పోస్టులు 2, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు 5, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టులు 1, అలాగే గ్రూప్- బి పోస్టులు విషయానికి వస్తే సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 1, అసిస్టెంట్ పోస్టులు 7, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు 6, ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు 1, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు 1, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 1, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు 1, ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ-వీసీ) పోస్టులు 1, హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు 1, స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులు 1 ఖాళాగా ఉన్నాయి.

READ ALSO : Watermelon Juice : అసిడిటీ నుండి ఉపశమనం పొందాలనుకునే వారికి పుచ్చకాయ జ్యూస్ బెటర్ !

గ్రూప్-సి పోస్టులకు సంబంధించి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 7, , సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు 2, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 56, హిందీ టైపిస్ట్ పోస్టులు 1, డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్) పోస్టులు 1, కుక్ పోస్టులు 1, ఎంటీఎస్‌ పోస్టులు 29 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Vitamin D : రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు !

పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.efluniversity.ac.in/ పరిశీలించగలరు.