Job Vacancies : రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల భర్తీ

Job Vacancies : రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల భర్తీ

Job Vacancies : రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. హెడ్‌క్వార్టర్స్ నార్తర్న్ కమాండ్, డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైర్‌మ్యాన్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 23 కాగా, వాటిలో సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) 5 పోస్టులు, వెహికల్ మెకానిక్ 1 ఖాళీ, క్లీనర్ 1ఖాళీ, ఫైర్‌మెన్ 14 పోస్టులు, మజ్దూర్ 2 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, ఈ పోస్టులకు సంబంధిత నైపుణ్య పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి జీతంగా నెలకు రూ. 18,000ల నుంచి రూ.45700ల వరకు చెల్లిస్తారు. వీటితోపాటు ఇతర అలవెన్సులను చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పంపించడానికి చివరి తేదీ ఆగస్టు 22, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ mod.gov.in పరిశీలించగలరు.