WAPCOS Recruitment : వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ఇంజినీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా/పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

WAPCOS Recruitment : వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

WAPCOS Recruitment :

WAPCOS Recruitment : భారత ప్రభుత్వ విభాగానికి చెందిన గురుగావ్‌లోని వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయటనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 161 టీమ్ లీడర్,ఎక్స్‌పర్ట్‌, క్వాంటిటీ సర్వేయర్ తదితర పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

పోస్టుల ఖాళీలను పరిశీలించే టీమ్ లీడర్/ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు 2, క్వాంటిటీ సర్వేయర్ పోస్టులు 2, స్ట్రక్చరల్ ఇంజినీర్ పోస్టులు 4, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్-I పోస్టులు 2, హైడ్రాలిక్ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు 2, రెసిడెంట్ ఇంజినీర్, సీనియర్ నీటి సరఫరా ఇంజినీర్ పోస్టులు 7, సీనియర్ కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్ పోస్టులు 10, మెటీరియల్ ఇంజినీర్ పోస్టులు 7, నీటి సరఫరా, CADD ఇంజినీర్ పోస్టులు 15, క్వాంటిటీ సర్వేయర్-II పోస్టులు 15, కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్ పోస్టులు 30, సర్వే ఇంజినీర్ పోస్టులు 15 ఉన్నాయి.

వీటితోపాటు ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్-II పోస్టులు 15 , సైట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 18, సైట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు 2, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు 5, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 5, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 5 ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ఇంజినీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా/పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఈ అర్హతలున్నవారు మెయిల్ ద్వారా ఫిబ్రవరి 2, 2023వ తేదీలోగా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. ఈమెయిల్‌ ఐడీ: hrwapcosbbsr@gmail.com. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.wapcos.gov.in/ పరిశీలించగలరు.