Jobs : సీ డ్యాక్ లో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు జులై 20, 2022 చివరి తేదిగా నిర్ణయించారు.

Jobs : సీ డ్యాక్ లో ఉద్యోగాల భర్తీ

Jobs : భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సీ డ్యాక్) ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనుంది. దేశవ్యాప్తంగా ఉన్న సీ డ్యాక్ కేంద్రాల్లో మొత్తం 650 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బెంగుళూరు, చెన్నై, దిల్లీ, పుణె, నోయిడా, ముంబయి, మొహాలీ, జమ్మూ, పాట్నా, కోల్ కతా, టీవీఎం, సిల్చార్ లలో ఈ ఖాళీలు ఉన్నాయి.

భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్లు 50 ఖాళీలు, ప్రాజెక్ట్ ఇంజినీర్లు 400 పోస్టులు, ప్రాజెక్ట్ మేనేజర్లు 50 పోస్టులు , సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్లు 150 పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు జులై 20, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://careers.cdac.in/పరిశీలించగలరు.