Cochin Shipyard : కొచ్చిన్ షిప్ యార్డులో పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు.

Cochin Shipyard : కొచ్చిన్ షిప్ యార్డులో పోస్టుల భర్తీ

Jobs

Cochin Shipyard : భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ మంత్రిత్వ శాఖకు చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ( సీఎస్ఎల్) లో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 330 ఒప్పంద ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టులలో ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్లు 124 ఖాళీలు, ఔట్ ఫిట్ అసిస్టెంట్లు 206 ఖాళీలు ఉన్నాయి. షీట్ మెటల్ వర్కర్లు, వెల్డర్లు, మెకానిక్ డీజిల్ , ఫ్లంబర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషీయన్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ , డ్రాప్ట్స్ మెన్ సివిల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు. ఎంపిక విషయానికి వస్తే అబ్జెక్టివ్ టైప్ ఆన్ లైన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభమై జులై 15, 2022తో ముగుస్తుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://cochinshipyard.in/Career పరిశీలించగలరు.