IIM Jammu : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ లో ఖాళీ పోస్టుల భర్తీ

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ పీజీడీసీఏ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

IIM Jammu : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ లో ఖాళీ పోస్టుల భర్తీ

IIM Jammu : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జమ్మూ క్యాంపస్‌లో ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అడ్మిన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, వెబ్‌ డిజైనర్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ పీజీడీసీఏ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 2,09,200 వరకు చెల్లిస్తారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 31 డిసెంబర్ 2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iimj.ac.in/ పరిశీలించగలరు.