NAL Recruitment : నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్‌లో ఖాళీ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ప్రాజెక్ట్ అసోసియేట్ - I పోస్టులకు బీఈ, బీటెక్ ఎమ్మోస్సీ పూర్తి చేసి ఉండాలి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు డిప్లొమా, బీఎస్సీ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రాజెక్ట్ అసోసియేట్ - II, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

NAL Recruitment : నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్‌లో ఖాళీ పోస్టుల భర్తీ

Vacancy in National Aerospace Laboratories

NAL Recruitment : నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్‌లో(NAL) వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ సహా మొత్తం 75 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ 30, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 20, ప్రాజెక్ట్ అసోసియేట్ డివిజన్ II – 24, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఖాళీ ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ప్రాజెక్ట్ అసోసియేట్ – I పోస్టులకు బీఈ, బీటెక్ ఎమ్మోస్సీ పూర్తి చేసి ఉండాలి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు డిప్లొమా, బీఎస్సీ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రాజెక్ట్ అసోసియేట్ – II, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్టులకు 40 ఏళ్ల లోపు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఎంపిక ప్రక్రియరాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.20,000-42,000 చెల్లిస్తారు.

దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సి చిరునామా ; CSIR-NAL RAB మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ [NAL], SBI పక్కనే, NAL బ్రాంచ్, కోడిహళ్లి, బెంగళూరు – 56001 వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 20 అక్టోబర్ 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nal.res.in/e