NSU Recruitment : తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పలు పోస్టుల భర్తీ

అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు గౌరవేతనంగా నెలకు రూ. 50,000 అందిస్తారు.

NSU Recruitment : తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పలు పోస్టుల భర్తీ

NSU Recruitment : తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో (ఎన్ఎస్ యు)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా యూనివర్సిటీలో పలు విభాగాల్లో ఉన్న మొత్తం 39 గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. సాహిత్యం, ఇంగ్లిష్‌, హిందీ, హిస్టరీ, ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌, మిమంస, ఆగమ, యోగా, జ్యోతిష, కంప్యూటర్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ విభాగాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ,ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌, స్లెట్‌, సెట్‌ అర్హత పొంది ఉండాలి.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు గౌరవేతనంగా నెలకు రూ. 50,000 అందిస్తారు. ఇంటర్వ్యూలను 6 సెప్టెంబర్ 2022 నుంచి 8 సెప్టెంబర్ 2022 తేదీల్లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలను నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nsktu.ac.in/ పరిశీలించగలరు