Warangal NIT : వరంగల్ నిట్ లో ఒప్పందప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ

ఈనోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన అడ్‌హక్‌ ఫ్యాకల్టీ, ప్రాజెక్ట్ అసోసియేట్ ,ప్రోగ్రామర్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, అడ్‌హక్‌ ఫ్యాకల్టీ (కెమికల్ ఇంజినీరింగ్, సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్)లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.

Warangal NIT : వరంగల్ నిట్ లో ఒప్పందప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ
ad

Warangal NIT : భారత ప్రభుత్వ రంగానికి చెందిన వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్)లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన అడ్‌హక్‌ ఫ్యాకల్టీ, ప్రాజెక్ట్ అసోసియేట్ ,ప్రోగ్రామర్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, అడ్‌హక్‌ ఫ్యాకల్టీ (కెమికల్ ఇంజినీరింగ్, సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్)లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఎంటెక్ (సీఎస్‌ఈ/సీఎస్‌ఐఎస్/ఐటీ) లేదా పీహెచ్‌డీ (సీఎస్‌ఈ), బీఈ, బీటెక్‌ (సీఎస్‌ఈ, ఐటీ) లేదా ఎంసీఏ, ఎంఈ, ఎంఎస్సీ/ఎంఎస్సీ, ఎంటెక్‌ (ఫిజిక్స్/ఇంజినీరింగ్ ఫిజిక్స్/ఫొటోనిక్స్‌) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.31,000ల నుండి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తమ దరఖాస్తులను మెయిల్‌ ;sangu@nitw.ac.in, sroy@nitw.ac.in, chemical_hod@nitw.ac.in, maths_hod@nitw.ac.inకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు ఆగస్టు 12, 2022 తుదిగడువుగా నిర్ణయించారు.