ఆరోగ్యం కోసం : స్కూల్లో వాటర్ బెల్

  • Published By: madhu ,Published On : November 21, 2019 / 02:17 AM IST
ఆరోగ్యం కోసం : స్కూల్లో వాటర్ బెల్

స్కూల్లో వాటర్ బెల్ ఏంటీ..ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బెల్ కొడుతారు కానీ..ఇదేంటీ అని అనుకుంటున్నారా…ప్రతి రోజు వాటర్ బెల్ విధానం అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు సరిపడా..తాగునీటిని అందించాలని డీఈవోలు, ఎంఈవోలు, హెడ్ మాస్టర్లను ఆదేశించింది. విద్యార్థులు సరిపడా తాగునీరు తాగకపోవడం వల్ల..అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని విద్యాశాఖ గుర్తించింది. ఇందుకు వాటర్ బెల్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రోజులో వీలైనన్నీసార్లు వాటర్ బెల్ కొట్టాలని సూచించింది. ఆయా సమయాల్లో విద్యార్థులంతా నీటిని తాగేలా చూడాలని సూచించింది.

కొన్ని జిల్లాల్లో రోజుకు మూడుసార్లు, మరికొన్ని జిల్లాల్లో నాలుగుసార్లు దీన్ని అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలోనూ అమలు చేసేలా చర్యలు చేపట్టింది. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఈ విధానం ప్రారంభమైంది. గంట కొట్టి మరీ నీటిని తాగించడంపై సర్వాత్ర హర్షం వ్యక్తమైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు వెళుతున్న విద్యార్థుల్లో అధికశాతం తగిన మోతాదులో నీటిని తాగడం లేదని, దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.

నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడవని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మందికి దాన్ని అలవాటు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆకలి వేయగానే..ఏవో ఒకటి తినేయకుండా..గ్లాసు మంచినీళ్లు తీసుకోవడం బెటర్ అంటున్నారు వైద్యులు. కొత్తల్లో బాత్రూమ్‌‌కి వెళ్లాల్సి వస్తుందని బాధ పడుతుంటారు..కానీ ఈ సమస్య కేవలం ప్రారంభంలో ఉంటుందని..రెండు వారాల్లో ఎక్కువ నీటికి బ్లాడర్ అలవాటు పడిపోతుందని అంటున్నారు.
Read More : చిక్కుల్లో చెన్నమనేని : ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం