వెస్ట్ సెంట్రల్ రైల్వే(WCR) లో అప్రెంటిస్ ఉద్యోగాలు

10TV Telugu News

వెస్ట్ సెంట్రల్ రైల్వే(WCR)లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 570 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
ఎలక్ట్రీషియన్ – 138
వెల్డర్ – 34
మెషినిస్ట్ – 10
ఫిట్టర్ – 116
డ్రాప్ట్స్ మెన్(సివిల్) – 10
వైర్ మెన్ – 30

మెషన్ – 26
కార్పెంయిటర్ – 28
పెయింటర్ – 23
సర్వేయర్ – 8
ఏసి మెకానిక్ – 10
హార్టికల్చర్ అసిస్టెంట్ – 12

ఎలక్ట్రానిక్ మెకానిక్ 15
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 52
స్టెనోగ్రాఫర్(హిందీ, ఇంగ్లీష్) – 6
కేబుల్ జాయింటర్ – 2
డీజిల్ మెకానిక్ – 30
బ్లాక్ స్మిత్ – 16
సెక్రెటేరియల్ అసిస్టెంట్ -4

విద్యార్హత : అభ్యర్దులు 10వ తరగతి, ఇంటర్ లో 50 శాతం మార్కులతో పాసై అయ్యి ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్ధులు రూ.170 చెల్లించాలి. SC,ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్దులు రూ. 70 మాత్రం చెల్లించాలి.

వయసు : అభ్యర్దులు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ  నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : అభ్యర్దులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 15, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 15, 2020.

×