Wipro Jobs : ఉద్యోగుల ఎంపికకోసం ఎలైట్ 2022 నిర్వహించనున్న విప్రో |Wipro will conduct Elite 2022 for employee selection

Wipro Jobs : ఉద్యోగుల ఎంపికకోసం ఎలైట్ 2022 నిర్వహించనున్న విప్రో

ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఆప్టిట్యూడ్‌, రిటెన్‌ కమ్యూనికేషన్‌, ఆన్‌లైన్‌ ప్రోగ్రామింగ్‌ విభాగాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు.

Wipro Jobs : ఉద్యోగుల ఎంపికకోసం ఎలైట్ 2022 నిర్వహించనున్న విప్రో

Wipro Jobs : బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ విద్యార్థులకు ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్ధ విప్రో శుభవార్త చెప్పింది. బీఈ,బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులు పూర్తి చేసుకున్న, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులకు ఆసంస్ధ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. దీనికి గాను ఎలైట్‌-2022 పేరుతో పరీక్షలు నిర్వహించనుంది. ఎలైట్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ (ఎన్‌టీహెచ్‌)2022 పేరుతో విప్రో దేశవ్యాప్తంగా ప్రతిభకలిగిన ఇంజినీరింగ్‌ ఫ్రెషర్ల కోసం ఈ పరీక్ష నిర్వహించనుంది.

అర్హతల విషయానికి వస్తే పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. బీటెక్‌,బీఈ,ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌లో 60 శాతం తప్పనిసరి. 2021లో కోర్సులు పూర్తిచేసుకున్నవారు, 2022లో బీటెక్‌ లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులు పూర్తిచేసుకోబోతున్నవాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ మధ్య అకడమిక్‌ గ్యాప్‌ మూడేళ్లకు మించరాదు. అసెస్‌మెంట్‌ స్టేజ్‌ సమయానికి ఒక బ్యాక్‌లాగ్‌ కంటే ఎక్కువ ఉండకూడదు. ఉద్యోగంలో చేరేటప్పటికీ ఉత్తీర్ణత సాధించాలి.

ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఆప్టిట్యూడ్‌, రిటెన్‌ కమ్యూనికేషన్‌, ఆన్‌లైన్‌ ప్రోగ్రామింగ్‌ విభాగాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి టెక్నికల్‌, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిలోనూ ప్రతిభ చూపిస్తే శిక్షణకు ఎంపికచేస్తారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. ఎంపికైనవారికి రూ.3.5 లక్షల వార్షిక వేతనం అందిస్తారు. ఏడాది పాటు సంస్థలో కొనసాగాలి. ఇందుకోసం రూ.75,000 విలువైన ఒప్పంద పత్రంపై అంగీకారం తెలపాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు మే 22, 2022 చివరితేదిగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు మే 21 నుంచి జూన్‌ 5 వరకు కొనసాగుతాయి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://careers.wipro.com/elite పరిశీలించగలరు.

      ×