లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

గుండెల్లో వేగం పెంచుతున్న ఈషా..

Published

on

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసే తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా… ముంబై భామలతో ఏ మాత్రం తీసిపోకుండా అందంతో కట్టిపడేసే ఈషా అంతకుముందు ఆ తర్వాతతో ఫ్యామస్ అయింది. చివరిగా రాగల 24గంటల్లో సినిమాలో కనిపించింది. 1990 తమిళ సినిమా పురియాధా పుధీర్ రీమేక్ ఇది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో గుండె దడ పెంచే ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.


కెరీర్ స్టార్టింగ్ నుంచి లుక్స్‌లో ఈషా నో కాంప్రమైజ్. మోకాళ్లపై వరకూ కాక్ టైల్ డ్రెస్ వేసుకుని హాట్ గా కనిపిస్తుంది. ఈ ఇమేజ్ లో బ్యాక్ గ్రౌండ్ డార్క్‌నెస్ ఆమె అందాన్ని మరింత ఎలివేట్ చేస్తుంది. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈషా.. అనన్య పాత్రలో పెళ్లికి ముందే ఫిజికల్ రిలేషన్‌షిప్ లో ఉండే సన్నివేశాల్లో నటించింది.

క్యాజువల్ అవుట్ డోర్ లుక్ అయినప్పటికీ ప్రతి అంగుళం హాట్ గా అనిపించే క్లిక్ ఇది. ఫొటో షూట్ అయినా క్యాజువల్ అవుట్‌డోర్ లుక్ ఇదే. గ్యార్జియస్ ఫొటోల్లో ఇది కూడా ఒకటి. తెలుగు సినిమాల్లోనే మనకు కనిపించే ఈషా.. తమిళ సినిమాల్లోనూ కనిపించింది. సుదీప్ సరసన చేసిన సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోనూ ఓ ట్రయల్ వేసింది.


లెహంగా చోలీ.. సంప్రదాయ లుక్ తో పాటు వేడి పుట్టించే అందం కలిసినట్లుందీ లుక్. గుచ్చుకునే చూపులతో మెరిసిపోతున్న ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. భారీ ఎంబ్రాయిడరీ, అద్ధాలతో కూడి డిజైనర్ లెహంగా చోలీ వేసుకుని ఉన్న ఫొటోలో ఆమె సిల్కీ బ్లాక్ హెయిర్ క్షణకాలం మత్తులో దించేలా ఉంది.

ఫొటో షూట్ అంటే ఇదే. టాలెంటెడ్ ఈషా.. బ్లాక్ డ్రెస్ లో షాక్ ఇస్తుంది. తేలే నల్లని మబ్బులు వంటి మీద వాలినట్లు పల్చటి తెరలాంటి డ్రెస్ తో సెమీ డ్రెస్ లో మెరిసిపోతుందీ తెలుగందం. 2018లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ఆ మూవీలో రాధ పాత్రలో అలరించింది. మగాళ్లతో జరిగిన ఎక్స్‌పీరియన్స్ కు విరక్తి పుట్టి ఓ అమ్మాయినే ప్రేమిస్తుంది ఈషా. ఆమె తల్లిదండ్రులకు తనకు చిన్నప్పటి నుంచి ఓ అమ్మాయిపై ప్రేమ ఉందని చెప్పే సీన్ భళే అనిపిస్తుంది.

భారత సంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టినా.. ఒంటిపై తేనెపోసినట్లుగా మెరిసిపోతూ చీరలో చూపుతిప్పుకోకుండా చేస్తుంది. ఎంబ్రాయిడరీ అంచుతో సింపుల్ శారీకి సాఫ్ట్ లుక్ ను పెంచుతూ ప్రతీ అమ్మాయి ఇలాంటి చీరే కావాలనుకునేలా ఉందీ ఫొటో. చాలా పొందిగ్గా ఉన్న ఫొటోను చూస్తే ఎవరికైనా చూపు తిప్పుకోవాలని అనిపిస్తుందా మరి..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *